ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ స్టేడియం అందుబాటులోకి తేవాలి

ABN, First Publish Date - 2022-01-19T05:57:52+05:30

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఫిబ్రవరి 15లోగా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.

స్టేడియం పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఫిబ్రవరి 15లోగా పనులు పూర్తి చేయాలి

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఫిబ్రవరి 15లోగా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మినీ స్టేడియం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 80 శాతం పనులు ప్తూర్తయినట్లుగా సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రూ.3 కోట్ల వ్యయంతో 4 ఎకరాల స్థలంలో మినీ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు.  వారం రోజుల్లోగా ఆర్చ్‌,  సీసీ రోడ్లు, వాకింగ్‌ ట్రాక్‌ పనులు పూర్తి చేయాలని, సూచికల బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్‌ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, స్టేడియం   పనులను పర్యవేక్షించాలని అన్నారు. 

Updated Date - 2022-01-19T05:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising