ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలీన గ్రామాలను పంచాయతీలుగా కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-10-08T05:57:11+05:30

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో విలీనం చేసిన గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించాలని మున్సిపల్‌ విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.

పెద్దూర్‌లో సంతకాలు సేకరిస్తున్న ఐక్యవేదిక నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 7: ిసిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో విలీనం చేసిన గ్రామాలను  పంచాయతీలుగానే కొనసాగించాలని మున్సిపల్‌ విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని పెద్దూర్‌లో విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. పెద్దూర్‌  బస్టాండ్‌లో ఐక్యవేదిక నాయకులు చేపట్టిన సంతకాల సేకరణలో మున్సిపల్‌ పరిధిలోని 8, 9 వార్డులకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తమ గ్రామాలకు మున్సిపల్‌ నుంచి విముక్తి కల్పించాలని, గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ గ్రామాలను మున్సిపల్‌లో విలీనం చేసినప్పటి నుంచి ఉపాధిహామీ లేకుండా పోయిందని, దీంతో చాలామంది కూలీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విలీన గ్రామాలతో అర్భన్‌ మండలంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సలేంద్రీ బాలరాజు, బెజ్జారపు నారాయణగౌడ్‌, ఉలిసె తిరుపతి, భూక్య కిషన్‌నాయక్‌, చెన్నమనేని కమలాకర్‌రావు, జెట్టి రమేష్‌, అదిపల్లి శ్రీనివాస్‌, గంభీరావుపేట ప్రశాంత్‌గౌడ్‌, వంగ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising