ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాలయానికి ముస్లింల విరాళం

ABN, First Publish Date - 2022-03-05T06:07:59+05:30

రామాలయానికి ముస్లింల విరాళం

ఉప్పరపల్లిలో రామాలయానికి విరాళం అందజేస్తున్న ముస్లిం దంపతులు అమీరొద్దిన్‌-షరీఫ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసముద్రం, మార్చి 4 : రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని కొన్నిచోట్ల మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తరుణంలో మ తాలకతీతంగా రామాలయానికి ముస్లింలు విరా ళం ఇచ్చి పరమత సహనానికి నిదర్శనంగా నిలిచారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో నూతనంగా సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతు అయిన మహ్మద్‌ అమీరొద్దిన్‌-షరీఫ, వారి కుమారుడు విద్యుత్‌ శాఖలో సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అజ్మత్‌-సైనాజ్‌ దంపతులు రూ.31,786ల విరాళాన్ని శుక్రవారం అందజేశారు. మతాలకతీతంగా విరాళం అందించడంపై పలువురు గ్రామస్తులు అభినందించారు. ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ ఎలబోయిన సారయ్య, వార్డు సభ్యుడు అరిగె విజేందర్‌, నూకల వెంకటేశ్వర్లు, మంచాల కుమార్‌, తండ సంపత్‌ పాల్గొన్నారు

Updated Date - 2022-03-05T06:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising