బీజేపీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
ABN, First Publish Date - 2022-12-15T00:06:59+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా గురు వారం కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేం దుకు విస్తృత ఏర్పాట్లు చేసింది.
కరీంనగర్ టౌన్, డిసెంబరు 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా గురు వారం కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేం దుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షు డు జేపీ నడ్డా, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరవుతుండడంతో ఈ బహిరంగ సభకు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఈ సభను పార్టీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగబోతున్నాయని రకరకాల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో జరుగబోతున్న బీజేపీ సభ జిల్లాలో రాజకీయ వేడిని రగిలిస్తున్నది. భారీ సంఖ్యలో జనసమీక రణ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దిశానిర్దేశం చేస్తుండగా జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పలువురు నాయకులు బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ప్రతి బూత్ నుంచి కనీసం వంద మంది చొప్పున తరలించేందుకు ఆహ్వాన పత్రాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు.
ఫ కాషాయమయంగా కరీంనగర్..
బీజేపీ ప్రజాసంగ్రామయాత్ర ముగింపు భారీ బహి రంగ సభ సందర్బంగా కరీంనగర్‌లో ఆ పార్టీ నేత భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలతో కాషా యమయంగా మారింది. సభా ప్రాంగంణం ఎస్సారార్ కళాశాల మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.
ఫ భారీ బందోబస్తు
కరీంనగర్ క్రైం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరువుతున్న దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ జి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు, ఆరు గురు సీఐ, 13 మంది ఎస్‌ఐలు, 37 మంది ఏఎస్‌ఐలు, 60 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా హోం గార్డు లు, 10 మంది హోంగార్డులు, రెండు స్పెషల్ పార్టీలు (డిస్ట్రిక్ట్‌గార్డులు), మూడు బీడీ టీంలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-12-15T00:07:03+05:30 IST