ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవనోపాధి కల్పించడమే ‘దళితబంధు’ ముఖ్యోద్దేశం

ABN, First Publish Date - 2022-01-26T06:28:44+05:30

బడుగు, బలహీన వర్గాలకు జీవనోపాధి కల్పించడమే ‘దళిత బంధు’ పథకం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైన నేపథ్యంలో అధికారులు నిర్వహించిన సర్వే ప్రక్రియను మంగళవారం పరిశీలించారు.

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డిపేట, జనవరి 25: బడుగు, బలహీన వర్గాలకు జీవనోపాధి కల్పించడమే ‘దళిత బంధు’ పథకం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైన నేపథ్యంలో అధికారులు నిర్వహించిన సర్వే ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  కలెక్టర్‌ మాట్లాడుతూ దళిత కుటుంబాలు ఆర్థిక పురోగతి సాధించేందుకు దళిత బంధు పథకం ఉపయోగపడుతుందన్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల ద్వారా ఉత్పత్తి సాధించడంతోపాటు ఆర్థికంగా ఎదిగి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఒకరు ఇద్దరు కలిసి రుణం పొంది వ్యాపారాన్ని సాగించవచ్చన్నారు. గ్రామంలో పెట్రోల్‌ బంక్‌, రైస్‌ మిల్లులు ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుందన్నారు.   ఏ రంగాన్ని ఎంచుకుంటే ఉపాధి లభిస్తుందో ఆలోచించుకోవాలన్నారు. పథకంలో  తొందర లేదని ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.   లబ్ధిదారులకు వివిధ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ అందించి దళిత బంధును వర్తింపజేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వజ్రమ్మ, అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌, ఆర్టికల్చర్‌ జిల్లా అధికారి జ్యోతి, ఎంపీపీ రేణుక, వైస్‌ ఎంపీపీ భాస్కర్‌, ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌, తహసీల్దార్‌ మజీద్‌, ఎంపీడీవో చిరంజీవి, ఏవో భూమిరెడ్డి, ఎంపీవో వజీర్‌అహ్మద్‌, ఎంపీటీసీ మల్లేశం, మాజీ సెస్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి, నాయకులు కిషన్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

 వారం రోజుల్లో మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు చేపట్టాలి

వారం రోజుల్లో మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు, పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం పరిశీలించారు. ట్యాంక్‌ బండ్‌ కట్ట పొడవునా  మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రహదారిపై ప్రజలు సేదతీరేలా బెంచీలు, విద్యుద్దీపాలు, పబ్లిక్‌ మరుగుదొడ్లు, క్యాంటీన్‌ నిర్మించాలని సూచించారు. ఆహ్లాదకర వాతావరణాన్ని పంచేలా పనులు చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనం విస్తీర్ణం, చిల్డ్రన్‌ పార్కును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.  మండల పరిషత్‌ ఆధ్వర్యంలో కొనసాగించాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, తహసీల్దార్‌ మజీద్‌, ఎంపీడీవో చిరంజీవి, ఏపీవో కొమురయ్య, ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌, వైస్‌ ఎంపీపీ భాస్కర్‌, ఎంపీటీసీ నాగరాణి, నాయకులు కిషన్‌, పర్శరాములు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-26T06:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising