ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా బతుకమ్మ సంబరాలు

ABN, First Publish Date - 2022-10-02T05:05:26+05:30

సద్దుల బతుకమ్మకు ఒక రోజు ముందే జిల్లా కేంద్రం పండుగ శోభను సంతరించుకుంది. జిల్లా కేంద్రంలో బల్దియా ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన మహా బతుకమ్మ-2022 వేడుక లు అంబరాన్నాంటాయి.

మహా బతుకమ్మ ఊరేగింపులో పాల్గొన్న పాలక వర్గం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 20 ఫీట్ల ఎత్తు, 11 ఫీట్ల వెడల్పుతో తయారు

జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో వేడుకలు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 1 :సద్దుల బతుకమ్మకు ఒక రోజు ముందే  జిల్లా కేంద్రం పండుగ శోభను సంతరించుకుంది. జిల్లా కేంద్రంలో బల్దియా ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన మహా బతుకమ్మ-2022 వేడుక లు అంబరాన్నాంటాయి.  20 ఫీట్ల ఎత్తు, 11 ఫీట్ల వెడల్పు, సుమారు 160 కిలోల పూలతో తయారు చేసిన మహా బతుకమ్మ పట్టణ ప్రజలను ఆక ట్టుకుంది. చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, బల్దియా పాలక వర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో పట్టణంలో పురవీధుల గుండా మహా బతుకమ్మను నృత్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. స్థానిక టౌన్‌ హాలు వద్ద ఊరే గింపును బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. పట్టణ ప్రజలు మహా బతుకమ్మకు మంగళ హారతులో స్వాగతం పలికారు. అనంతరం బల్దియా కార్యాలయం ఎదుట  కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ ప్రజలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు.  ఎస్పీ సింధు శర్మ, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సతీమణి రాధిక, ఎమ్మెల్సీ రమణ సతీమణి సంధ్య, మెట్‌పల్లి బల్దియా అధ్యక్షురాలు రాణవేని సుజాత, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీలు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మహా బతుకమ్మను తహసీల్‌ చౌరస్తా, టవర్‌, తీన్‌ఖని మీదుగా శోబాయాత్రగా తీసుకవెళ్లి స్థానిక చింతకుంట చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కమిషనర్‌ గంగాధర్‌, డీఈ రాజేశ్వర్‌తో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు ఉన్నారు.

జగిత్యాల ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలి

శ్రావణి, జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌, 

బతుకమ్మ తల్లి దీవెనలతో జగిత్యాల పట్టణ ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలి. మహా బతుకమ్మ వేడుకలను కౌన్సిల్‌ సభ్యుల సహాకారంతో విజయవంతం చేశాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే పండుగలకు పెద్దపీఠ వేసింది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. జగిత్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా ప్రధాన లక్ష్యం

Updated Date - 2022-10-02T05:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising