ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల జీవితాల్లో వెలుగులు

ABN, First Publish Date - 2022-12-16T01:12:36+05:30

సీఎం కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బలపరిచే అభ్యర్థికి అండగా ఉండాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లంతకుంట, డిసెంబరు 15: సీఎం కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బలపరిచే అభ్యర్థికి అండగా ఉండాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి మల్లుగారి రవీందర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా గురువారం మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడారు. మోటార్లకు మీటర్లు పెడుతామంటున్న బీజేపీ బలపర్చే అభ్యర్థి కావాలో? లేక రైతుల పక్షపాతి అభ్యర్థి కావలో? ఓటర్లు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రవీందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మామిడి సంజీవ్‌, ప్యాక్స్‌ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, రైతుబంధు అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా డైరెక్టర్‌ మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ అయిలయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్‌ చింతపల్లి వేణురావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాదుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising