ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలు

ABN, First Publish Date - 2022-10-08T05:26:25+05:30

గ్రంథాలయాలు సరస్వతీ నిలయా లని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాలు సరస్వతీ నిలయా లని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం ప ట్టణంలోని ఐఎంఏ హాలు సమీపంలో టీయూఎఫ్‌ఐడీసీ రూ. ఒక కోటి ని ధులతో నిర్మించతలపెట్టిన గ్రంథాలయ భవన పనులకు భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఒక వైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం పరుగులు పెడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ నేతృత్వంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గ్రంథాలయ సొంత భవన నిర్మాణానికి భూమి పూజ చేయ డం సంతోషంగా ఉందన్నారు. పాఠకుల అవసరాలకు అనుగుణంగా గ్రంథా లయాన్ని నిర్మించనున్నామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో పాఠకుల సంఖ్యకు తగ్గట్టుగా గ్రంథాలయ భ వన నిర్మాణం జరగాలని అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు సేకరించి పై అంతస్తు నిర్మాణం జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫైౖ నాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌ మాట్లాడుతూ గ్రంథాలయ భవన నిర్మా ణానికి అవసరమైన అదనపు నిధుల సేకరణపై దృష్టి సారించాలని అన్నా రు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల నుంచి గ్రం థాలయ సెస్‌ను వసూలు చేసి అభివృద్ధికి వ్యయం చేయాలని సూచించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సుమారు రూ. కోటి నిధులతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన పను లను వేగవంతంగా నిర్వహిస్తామన్నారు. భవన నిర్మాణానికి నిధులు మం జూరు, స్థల సేకరణ, టెండరు నిర్వహణ తదితర పనులకు అధికారులు, ప్ర జాప్రతినిధులు సహకరించారన్నారు. కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ మా ట్లాడుతూ జిల్లా కేంద్రంలో పాఠకుల అవసరాలకు తగ్గట్టుగా భవనాన్ని నిర్మి స్తుండడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌, ఆర్డీవో మాదురి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, డీఈ గంగారాం, కౌన్సిలర్లు శ్రీలత, రాంమోహన్‌, పద్మావతి సుమన్‌, ఇబ్రహీంపట్నం ఎంపీపీ, జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యురాలు బీమేశ్వరీ, సభ్యులు మారంపల్లి బాబు, డాక్టర్‌ ఉప్పుల నాగభూషణం పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T05:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising