ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-10-08T05:59:26+05:30

సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో హోమం నిర్వహించిన అనంతరం స్వామివారిని సూర్యవాహనంపై ఊరేగించారు.

స్వామివారి ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, అక్టోబరు 7: సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో హోమం నిర్వహించిన అనంతరం  స్వామివారిని సూర్యవాహనంపై  ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు   పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని కాలింగమర్ధనముపై  పురవీధుల గుండా ఊరేగించారు. రాత్రి ఆలయంలో హోమం నిర్వహించిన తర్వాత చంద్రవాహనంపై శోభాయాత్ర నిర్వహించారు.  అనంతరం ఆలయంలో సుందరకాండ, విష్ణుసహస్రనామ స్తోత్రం, భగవద్గీత, శ్రీ సుదర్శన శతకం, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము చేశారు.  ఆలయ అధ్యక్షుడు ఉప్పుల విఠల్‌రెడ్డి, ధర్మకర్తలు మేర్గు లక్ష్మణ్‌, మామిడాల రమణ, కత్తెర సంతోషిణి, కోడం శ్రీనివాస్‌, అల్లాడి సరస్వతి, ఎక్స్‌ అఫీషియోమెంబర్‌ సీహెచ్‌ రాంమోహనాచారి,  కార్యనిర్వహణాధికారి  మారుతిరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T05:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising