ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చూడాలి

ABN, First Publish Date - 2022-01-19T05:55:48+05:30

రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వేములవాడకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని జిల్లా పరిషత్‌ సీఈవో గౌతంరెడ్డి అన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-జడ్పీ సీఈవో గౌతంరెడ్డి

వేములవాడ, జనవరి 18 :  రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వేములవాడకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని జిల్లా పరిషత్‌ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. కొవిడ్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ ఈవో ఎల్‌.రమాదేవితో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతీ భక్తుడు మాస్కు ధరించేలా చూడాలని, శానిటైజర్‌ అందజేయడంతోపాటు థర్మల్‌గన్‌తో శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలని అన్నారు. మాస్కు ధరించని వారిని ఆలయంలోకి అనుమతించవద్దన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా కొవిడ్‌ నిబంధనలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఆలయ పరిసరాలు, కల్యాణకట్ట, పార్కింగ్‌ స్థలం, తిప్పాపూర్‌ బస్టాండ్‌తోపాటు 13 చోట్ల శానిటైజర్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆలయ అధికారులు వివరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, ఆలయ ఈఈ రాజేశ్‌, డీఈ రఘునందన్‌, ఏఈవోలు హరికిషన్‌, జయకుమారి, శ్రీనివాస్‌, నవీన్‌, సూపరింటెండెంట్లు శ్రీరాములు, అరుణ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T05:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising