దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం
ABN, First Publish Date - 2022-12-15T00:47:39+05:30
రాష్ట్రాన్ని దోచుకోవడానికి అలవాటు పడిన సీఎం కేసీఆర్ దేశాన్ని దోచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ఇల్లంతకుంట, డిసెంబరు 14: రాష్ట్రాన్ని దోచుకోవడానికి అలవాటు పడిన సీఎం కేసీఆర్ దేశాన్ని దోచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బుధవారం పొత్తూర్, కందికట్కూర్, వంతడుపుల గ్రామాల్లో ఏర్పాటే చేసిన సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మిగుల బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. తెలంగాణలో దోచుకున్న ధనంతో ఢిల్లీలో భవనాలు కడుతున్నారని విమర్శించారు. అహంకారం, ఆశయాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఎవరి పక్షం ఉంటారో తేల్చుకోవాలన్నారు. నిరుపేదలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఉద్యమం కొనసాగుతోందన్నారు. రిజర్వేషన్ల పెంచడం కోసం నాయకులను నిలదీయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి సమ్మయ్య, నాయకులు శిరీష, సుమలత, రాజమల్లు, ఏనుగుల లింగయ్య, ప్రభాకర్, పర్శరాం, దొంతి జాన్, అమర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫాంహౌస్ కరెంటు తొలగించే సమయం వస్తుంది
బీఎస్పీ సమావేశానికి కరెంటు తొలగించి టీఆర్‌ఎస్ నాయకులు సంతోషపడ్డారని, ఫాంహౌస్‌కు కరెంటు తొలగించే సమయం దగ్గరలోనే ఉందని ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి ఇల్లంతకుంటలో నిర్వహించిన సమావేశానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలుసుకొని టీఆర్‌ఎస్ నాయకులు కరెంటు లేకుండా చేశారన్నారు. అధికార బలం ఎంతో కాలం నిలవదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడైన ఎమ్మెల్యే రసమయికి పాఠశాల విలువ తెలియదా? అని ప్రశ్నించారు. పాఠశాలల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. సెస్ ఎన్నికల్లో బీఎస్పీ బలపర్చిన అభ్యర్థి ఏనుగుల లింగయ్యను గెలిపించాలని కోరారు.
Updated Date - 2022-12-15T00:47:45+05:30 IST