ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల సంక్షేమానికి కేసీఆర్‌ పెద్దపీట

ABN, First Publish Date - 2022-03-05T06:31:18+05:30

మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, మార్చి 4: మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా బంధు పేరుతో గోదావరిఖనిలో మూడురోజుల పాటు సంబరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈనెల 6వ తేదిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఆడబిడ్డలు రాఖీకట్టే కార్యక్రమం, పారిశుధ్య మహిళాకార్మికులకు, డాక్టర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్‌ఎంలకు సన్మానం, కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులతో థాంక్యు కేసీఆర్‌ పేర మానవహారాలు, 7వ తేదిన కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ లబ్ధిదారులు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ద్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి వారితో బెనిఫిషర్‌ విత్‌ సెల్ఫీ కార్యక్రమాన్ని, 8వ తేదిన నియోజకవర్గంలోని స్వశక్తి సంఘాలు, మహిళా లబ్ధి దారులకు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, మహిళా ప్రజాప్రతినిధులతో గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో 10వేల మందితో భారీ సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలి పారు. ఈ సభలో రామగుండం నియోజకవర్గంలో మహిళ లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కార్పొరేటర్లు బొడ్డు రజిత, కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్‌, జంజర్ల మౌనిక, శంకర్‌నాయక్‌, బాలరాజ్‌కుమార్‌, కల్వల శిరీష, కోఆప్షన్‌ సభ్యు లు తానిపర్తి విజయలక్ష్మి, తస్లీమభాను, టీఆర్‌ఎస్‌ నాయకులు కుమ్మరి శారద, సంధ్యారెడ్డి, బొడ్డు రవీందర్‌, అచ్చె వేణు, భూమయ్య, నూతి తిరుపతి, శాంత లక్ష్మి, ఇనుముల సత్యం, పిల్లి రమేష్‌, తోకల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising