ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌తోనే రైతులకు న్యాయం

ABN, First Publish Date - 2022-06-15T06:16:55+05:30

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆవునూర్‌లో మంగళవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అవునూర్‌ రచ్చబండలో రైతులతో కేకే మహేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్తాబాద్‌, జూన్‌ 14 : కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి  అన్నారు. మండలంలోని ఆవునూర్‌లో మంగళవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ వరంగల్‌లో రైతు డిక్లెరేషన్‌ ఇచ్చిందని జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ వెల్లడించిన అంశాలను రైతులకు వివరించారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ, రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, పంటలకు మద్దతు ధర  అందించనున్నట్లు తెలిపారు.  మంత్రి కేటీఆర్‌ ఇసుక దందా చేస్తూ హైదరాబాద్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు సారగొండ రాంరెడ్డి, మిరియాల్‌కార్‌ శ్రీనివాస్‌, అరుట్ల మహేశ్‌రెడ్డి, వెల్ముల రాంరెడ్డి, బత్తుల నవీన్‌, తాళ్ల విజయ్‌, సారుగు రాకేశ్‌, కనమేని బాల్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

నేరెళ్ల బాధితుడు హరీశ్‌కు మద్దతు

తంగళ్లపల్లి:  నేరెళ్ల బాధితుడు కోల హరీశ్‌ చేస్తున్న  పోరాటానికి కేకే మహేందర్‌రెడ్డి మద్దతు తెలిపారు.  అండగా ఉంటానని, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని  హామీ ఇచ్చినట్లు హరీశ్‌ తెలిపాడు.

 సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్ల మున్సిపల్‌లో విలీనమైన గ్రామాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామన్న మంత్రి కేటీఆర్‌ విస్మరించారని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం 1వ వార్డు రగుడులో పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైతులో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా  వరంగల్‌ సభలో రైతు  డిక్లరేషన్‌ను  వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు  నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15వేలు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.  ధాన్యం కొనుగోళ్లలో రైతులను దోచుకున్నా  సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నారగుడులోని పేదవారికి ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వలేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్‌ డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ నెరవేరుస్తారన్నారు. సిరిసిల్ల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, పట్టణ కార్యదర్శి కాసర్ల రాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ కిరణ్‌, నాయకులు సతీష్‌, బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-15T06:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising