ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలు భక్తుల ఆధ్వర్యంలో నడపడమే శ్రేయస్కరం

ABN, First Publish Date - 2022-05-18T05:50:19+05:30

భక్తుల ఆలోచనలతో నడిచే ఆలయాలే అభివృద్ధి చెందు తాయని, అదే ఎండోమెంట్‌ పరిధిలోకి వెళ్తే ఈ వైభవం కనిపించదని త్రిదండి చినజీ యర్‌ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వామి వారికి తాను గీసిన స్వామివారి చిత్రపటం అందిస్తున్న సత్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండోమెంట్‌ పరిధిలోకి వెళ్తే ఈ వైభవం కనిపించదు.

జగిత్యాలలో త్రిదండి చినజీయర్‌ స్వామి వ్యాఖ్యలు 

జగిత్యాల అర్బన్‌, మే 17: భక్తుల ఆలోచనలతో నడిచే ఆలయాలే అభివృద్ధి చెందు తాయని, అదే ఎండోమెంట్‌ పరిధిలోకి వెళ్తే ఈ వైభవం కనిపించదని త్రిదండి చినజీ యర్‌ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల చివరిరోజు ము గింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కరోనా కారణంగా రెండేళ్లుగా భక్తుల్లో కలిగిన లోటు తీరేట్టుగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారన్నారు. ఆస్వామికి మంచి బంగారు కిరీటం పాదాలు, హస్తాలు, మురళి సమర్పించడం అద్భుతంగా ఉందన్నారు. యితే వేణుగోపాల స్వామి ముఖంలో కళ కనిపించలేదని, వారి సతీమణులు రుక్మిణీ, సత్యభామకు ఏం సమర్పించలేదని అ నిపించిందని చెప్పుకొచ్చారు. భక్తుల ఆధ్వర్యంలో ఆలయాలను నిర్వహిస్తే కార్యక్రమాలు ఎంత వైభవంగా జరుగుతాయనేదానికి ఈ బ్రహ్మోత్సవాలు చక్కటి ఉదాహరణ అ న్నారు. ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తే ఇలాంటి వైభవం కనిపించదన్నారు. దేవుడి ఉత్సవాలను భక్తులు ఎంత శ్రద్ధతో చేస్తారని, ఆ భక్తులకు ప్రభుత్వాలు ప్రోత్సా హం ఇవ్వాలని ఆయన అన్నారు. చినజీయర్‌ వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారా యి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన స్వామికి పట్టణానికి చెందిన ప్ర ముఖ చిత్రకారుడు సత్యం స్వయంగా గీసిన స్వామివారి చిత్రాన్ని ఆయనకు అందజే శాడు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్‌ నంభి వేణుగోపాలచార్య కౌశిక, నంభి పార్థసారథి శర్మ, గుండేటి రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising