ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్థులకు సాయం చేయడం సంతోషకరం

ABN, First Publish Date - 2022-06-30T05:43:04+05:30

పేద విద్యార్థులకు సాయం చేయడం సంతోషక రమని డీఈవో డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ధర్మపురి జడ్పీహెచ్‌ఎస్‌ (బాలికల)లో విద్యార్థి దత్తత కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వ హించారు.

మాట్లాడుతున్న డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి

ధర్మపురి, జూన్‌ 29: పేద విద్యార్థులకు సాయం చేయడం సంతోషక రమని డీఈవో డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ధర్మపురి జడ్పీహెచ్‌ఎస్‌ (బాలికల)లో విద్యార్థి దత్తత కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సాయం చేయడం అనేది గొప్ప విషయ మని పేర్కొన్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దత్తత ప్రోగ్రాం కన్వీనర్‌, ఉపాధ్యాయులు గొల్లపల్లి గణేష్‌ అభినందనీయుడని ఆయన కొని యాడారు. ప్రోగ్రాం కన్వీనర్‌ గొల్లపల్లి గణేష్‌ మాట్లాడుతూ పేద విద్యార్థు లకు పేదరికం అడ్డుకాకూడదని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఇప్పటి వరకు విద్యార్థులకు 2500 ఎడ్యుకేషన్‌ కిట్స్‌ అందించినట్లు ఆయన వివరించారు. అంతకు ముందు జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని 23 పాఠశాలల కు చెందిన 650 మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బత్తుల భూమయ్య, లయన్స్‌ క్లబ్‌ పట్టణ అధ్యక్షు లు డాక్టర్‌ ఇందారపు రామకృష్ణ, హెచ్‌ఎం చెరుకు రాజన్న, వివిధ పాఠశా లల ఉపాధ్యాయులు, దాతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:43:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising