ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

ABN, First Publish Date - 2022-05-15T06:32:41+05:30

‘మన ఊరు-మన బస్తీ’ ‘మన ఊరు-మన బడి’తో సర్కారు పాఠశాలల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని, ఇందుకు తోడుగా పాఠశాలల అభివృద్ధిలో దాతలు భాగస్వాములు అవుతున్నారని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

భూమిపూజ చేస్తున్న నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  అభివృద్ధిలో భాగస్వాములవుతున్న దాతలు 

- నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు 

సిరిసిల్ల, మే 14 (ఆంధ్రజ్యోతి): ‘మన ఊరు-మన బస్తీ’ ‘మన ఊరు-మన బడి’తో సర్కారు పాఠశాలల్లో  ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని,  ఇందుకు తోడుగా పాఠశాలల అభివృద్ధిలో దాతలు భాగస్వాములు అవుతున్నారని  నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు  అన్నారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో తారకరామానగర్‌ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రహరీ, అదనపు తరగతి గదులు, టాయిలెట్స్‌ వంటి వసతులను కల్పించడానికి ‘మన ఊరు-మన బడి’ ద్వారా రూ.11 లక్షలు, సీఎస్‌ఆర్‌ నిధులు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ స్థానికంగా ఉండే ప్రముఖులు, ఎన్‌ఆర్‌ఐలు, భాగస్వాములు అవుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, సెస్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కౌన్సిలర్లు కల్లూరి లత, పోచవేని సత్య, భూక్య రెడ్డినాయక్‌, లింగంపల్లి సత్యనారాయణ, అడ్డగట్ల మాధవి, గెంట్యాల శ్రీనివాస్‌, కల్లూరి రాజు, దార్ల కీర్తన, ఆకుల కృష్ణ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ అగ్గిరాములు, అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ నేరేళ్ల శ్రీకాంత్‌, సెస్‌ డైరెక్టర్‌ నంది శంకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-15T06:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising