ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశభక్తి పెంపొందించేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-05T05:28:33+05:30

దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలోని 3,08,427 ఇళ్లపై జాతీయ జెండా ఎగరాలి

- మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో  జిల్లా స్థాయి అధికారులతో వజ్రోత్సవాల కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా, దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3,08,427 గృహాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ఘనంగా నిర్వహించనున్నదని మంత్రి వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 20 వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 9వ తేదీ నుంచే జిల్లా వ్యాప్తంగా జతీయ జెండాలు పంపిణీ చేయాలని సూచించారు. వజ్రోత్సవాలు ఈ నెల 8న ప్రారంభమవుతాయని, ఉదయం 7 గంటలకు అంబేద్కర్‌ స్టేడియం నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఆర్మీ/పోలీసు బ్యాండ్‌తో రాష్ర్టీయ సెల్యూట్‌ జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలో  స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, జమ్మికుంట, కొత్తపెల్లి మున్సిపల్‌ చైర్మన్లు రాజేశ్వర్‌రావు, రుద్ర రాజు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్‌డీవో శ్రీలత పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T05:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising