ప్రైవేట్‌కు దీటుగా
ABN, First Publish Date - 2022-10-17T05:52:16+05:30
ప్రభుత్వ జూనియర్ కళాశా లల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సా రించింది.
- జూనియర్ కళాశాలలో ఇక ప్రతీ వారం పరీక్ష
- ఎంసెట్, నీట్ పోటీ పరీక్షలకు సైతం
- ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు
- మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం...
జగిత్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశా లల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సా రించింది. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ కళాశాల తరహాలో ఆయా పాఠ్యాంశా లపై ప్రతి వారం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యా ర్థుల సామార్థ్యాలకు మెరుగు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంట ర్ బోర్డు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ ను కనబరచడానికి ప్రతి వారం పరీక్షలతో పాటు పలు మార్గదర్శకాలను సూచించింది. ఈమేరకు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవ సరమైన కసరత్తులను చేస్తున్నారు.
జిల్లాలో ఇలా...
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు కస్తూర్బా, ఇ తర గురుకుల జూనియర్ కళాశాలలు 41 వరకు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 26 ప్రభుత్వ, కస్తూర్బా, మోడల్, మై నార్టీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, లోకల్ బాడీస్, ఇతర సంక్షేమ కళా శాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 3 వేల మంది ప్రథమ సంవత్సర విద్యార్థులు, 3,335 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థు లు అభ్యసిస్తున్నారు.
నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ...
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆసక్తిని బట్టి ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావడానికి అనుగుణం గా శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు మొదటి నుంచి ఎంసెట్, నీట్‌లో ప్రవేశానికి ప్రత్యేక శక్షణ తరగతులు ని ర్వహిస్తున్నారు. దీంతో ప్రైవేట్ విద్యార్థులకే ప్రతీ సంవత్సరం మెరుగైన ర్యాంకులు వస్తుంటాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు నష్ట పో తుండేవారు. ఇకపై ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సైతం ప్ర త్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాల వి ద్యార్థులు సైతం మెడిసన్, ఇంజనీర్ వంటి కోర్సుల్లో సీట్లు పొందడానికి అవకాశం కల్పించనున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులే ఎక్కువ....
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి, రెండో సంవ త్సరంలో ఆరు వేల మందికి పైగా విద్యార్థులు చదు వుకుంటున్నారు. వీరిలో అధిక శాతం పేద విద్యార్థులే ఉండటంతో ఎక్కు వ మంది వ్యవసాయం, కూలీ పనులకు వెళుతూ చదువుకుంటుంటారు. దీని వల్ల చదువుపై ఎక్కువ దృష్టి సారించకపోవడంతో వార్షిక పరీక్షల ఫ లితాలు నిరాశాజనకంగా ఉంటున్నాయి. కానీ ప్రభుత్వం ప్రతివారం పరీక్ష లు నిర్వహించాలని, ప్రత్యేక తరగతులతో మెరుగైన ఫలితాలు సాధించా లనే లక్ష్యంతో చేపట్టిన నూతన విధానం పేద విద్యార్థులకు మేలు చేయనుంది.
పాత విధానంలోనే పరీక్షలు...
గతంలో కరోనా నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించ కుండానే ప్రమోట్ చేశారు. గతేడాది ప్రత్యేక తరగతుల నిర్వహణ ఆల స్యం కావడంతో మొత్తం సిలబస్ బోధించ లేకపోయారు. దీంతో 70 శా తం సిలబస్ తోనే ఎంపిక చేసిన పాఠ్యంశాలను బోధించి పరీక్షలు నిర్వ హించారు. ఈ విద్యా సంవత్సరంలో కరోనాకు ముందున్నట్లు పాత విధా నంలోనే వందశాతం సిలబస్ బోధించి పరీక్షలు నిర్వహించనున్నారు. నూ తన విధానం అమలు చేస్తూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక త రగతులు, పరీక్షలు నిర్వహించి మెరుగైన ఫలితాల సాధన కోసం విద్యా ర్థులను సన్నద్ధం చేయనున్నారు.
ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి మరిన్ని చర్యలు..
జిల్లాలో ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోను న్నారు. ఇటీవల ఇంటర్ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కళాశా లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, కళాశాల ఉపన్యాసకులకు బయోమెట్రిక్ అ టెండెన్స్, వర్చువల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు, క్యాంపస్ సెలక్షన్లు, కళాశా లల్లో ప్రతీ నిత్యం ప్రార్థన నిర్వహించడం, భవనాల మరమ్మతులు, పచ్చ దనం పరిశుభ్రత నిర్వహణ, క్రమశిక్షణ తదితర అంశాలపై దృష్టి సారిం చాలని ఇంటర్ బోర్డు సూచించింది. కళాశాలల్లో ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. కళాశాలల్లో ఆటల నిర్వహణ, కళా శాలలో సీనియర్ అధ్యాపకుడికి అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్‌గా నియమిం చనున్నారు. ఇంటర్ విద్య తదుపరి డిగ్రీ, పీజీ తదితర చదువులతో పాటు ఉపాధిని పొందేలా అవసరమైన సలహాలను విద్యార్థులకు అందించను న్నారు. కళాశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్స్, ఎడ్యూకేషనల్ టూర్స్ ఐదు కిలో మీ టర్ల లోపు నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీల వంటి ఆక్టివిటీలను పెంచడం, ప్రత్యేక తరగతులను నిర్వహించడం, కా లేజ్ డెవలప్ మెంట్ కమిటీలు, పేరెంట్ టీచర్ కమిటీల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. వీటితో ప్రభుత్వ కళాశాలను మరింత బలో పేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
మెరుగైన ఫలితాలు సాధ్యం
రెమిడి మల్లారెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుచేయనున్న వారాంతపు పరీక్షల నిర్వహణ, ఎంసెట్, నీట్ పరీక్షలకు ప్రత్యేక తరగతుల నిర్వహనతో గతంలో కంటే ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వ చ్చే అవకాశం ఉంది. కానీ పకడ్బందీగా అమలు చేస్తేనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.
ఇంటర్ బోర్డు మార్గదర్శకాల మేరకే...
నారాయణ, జిల్లా ఇంటర్ విద్యాధికారి
ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు సబ్జెక్టుల వారిగా పాఠ్యాంశాలపై వారా నికోకసారి పరీక్షలు నిర్వహిస్తాం. ఎంసెట్, నీట్ పరక్షల కోసం ప్రత్యేక తరగతులు బోధిస్తాం. జిల్లాలో ఈ విధానం అమలు చేసి ప్రతి విఽధ్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి మార్కులు సాధించడం ద్వారా మెరుగైన పలితాలతో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2022-10-17T05:52:16+05:30 IST