ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితుల కన్నీటిగాధను చూసి చలించిపోయాను

ABN, First Publish Date - 2022-09-30T05:03:59+05:30

ముంపు గ్రామాల నిర్వాసితులకు వందల కోట్లు ఇచ్చినా వారి కష్టాలు తీరవని, నిర్వాసితుల కన్నీటి గాధను చూసి చలించిపోయానని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనే ని రమేష్‌బాబు అన్నారు.

సంకెపల్లిలో నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, జడ్పీటీసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు

వేములవాడ టౌన్‌, సెప్టెంబరు 29: ముంపు గ్రామాల నిర్వాసితులకు వందల కోట్లు ఇచ్చినా వారి కష్టాలు తీరవని,  నిర్వాసితుల కన్నీటి గాధను చూసి చలించిపోయానని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనే ని రమేష్‌బాబు అన్నారు. వేములవాడ మండలం సంకెపల్లి, ఆరెపల్లి గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులకు జడ్పీటీసీ మ్యాకల రవి నేతృత్వంలో పరిహారం చెక్కులను, ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం సంకెపల్లిలో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంకెపల్లి, ఆరెపల్లి గ్రామా లు గతంలో ముంపులో లేవని ముంపు గ్రామంగా ప్రకటించి వారికి పరిహారం అందిస్తామనని మాట ఇచ్చానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు పరిహారం, పట్టాలను అందజేస్తున్నామన్నారు. అందులో భాగంగానే సంకెపల్లిలోని 90 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, 164 మంది, ఆరెపల్లిలో 41 మందికి రూ. 28 కోట్లు పరిహారం చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. మద్యమానే రు డ్యామ్‌కు తమ సారవంతమైన భూములను విశాలమైన ఇళ్లను త్యాగం చేసి పునరావాస కాలనీ ల్లో బతుకుతున్నారని వారి బాధలు తెలుసని వారి సమస్యల కోసం అధికారులను, మంత్రుల వద్దకు వెళ్లి తనవంతు కృషి చేశానని అన్నారు. నిర్వాసితు లు చేసిన త్యాగఫలమే నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నీరు ఎత్తిపోయగలుగుతున్నామని అన్నారు. సంకెపల్లి, ఆరెపల్లిలో పెండింగ్‌లో ఉన్న నిర్వాసితుల సమస్యలు కూడా అతిత్వరలో పరిష్కరి స్తామని, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మాటతీసు కుని వచ్చామని నిర్వాసితులకు తెలిపారు. నిర్వాసి తులకు ఉపాధి కోసం ఇతర జిల్లాల నేతలు ఫ్యాక్టరీ లు కావాలని పోటీ పడితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో రూ. 700 కోట్ల విత్తనాల తయారీ ఫ్యాక్టరీని త్వరలోనే భూమిపూజ చేసుకోనున్నామని గర్వంగ చెబుతున్నా మని అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వివరించారు. 

Updated Date - 2022-09-30T05:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising