ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ABN, First Publish Date - 2022-08-05T05:20:45+05:30

రుద్రంగి మండల కేంద్రంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది.

యూసుఫ్‌ను కాపాడిన పోలీసులు, స్థానికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారసంతలో కొట్టుకుపోయిన కూరగాయలు

రుద్రంగి, ఆగస్టు 4: రుద్రంగి మండల కేంద్రంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ప్రతి గురువారం మండల కేంద్రంలో వారసంత నిర్వహిస్తారు. అయితే భారీవర్షం కారణంగా వారసంత పూర్తిగా వరద నీరుతో నిండిపోయింది. భారీ వర్షానికి కూరగాయలు కొట్టుకుపోయాయి. ఇటీవల నూతనంగా నిర్మించిన మురికి కాలువ ఎత్తుగా కట్టడంతో వారసంతలో వరదనీరు ఆగి బురదమయంగా మురుతుందని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూరగాయ లు విక్రయించేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పట్టించుకోని వారసం త నిర్వహించే ప్రదేశంలో నూతన మురికికాలువ కంటే ఎత్తుగా మొరంమట్టి పోసి దుకాణదారులకు ఇబ్బందులు లేకండా చూడాలని కోరుతున్నారు. 

- వరదలో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన యుసఫ్‌ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోతుండగా పోలీసులు ఆయనను రక్షించారు. యూసఫ్‌ గురువారం రాత్రి వేములవాడ నుంచి రుద్రంగి వస్తుండగా కోరుట్ల -వేములవాడ ప్రధాన రహదారిలోని గండి వేంకటేశ్వర్ల ఆలయం వద్ద గల ఒర్రె వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా బైక్‌ను దాటించబో యాడు. అదుపుతప్పి వరద నీటిలో కొంతదూరం కొట్టుకుపోయాడు. దీంతో అక్కడే ఉన్న ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, పోలీసులు, స్థానికులు వెంటనే అతడిని బైక్‌తో సహా రక్షించారు. ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిలో మూడు గంటలు పాటు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

 - వరదనీటిలో చిక్కుకున్న కారు 

బోయినపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని గంజి వాగు వంతెనపై ఓ కారు చిక్కుకోగా స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి బోయినపల్లి- వేములవాడ మార్గమధ్యంలో స్థంబంపల్లి గ్రామ శివారున గల గంజి వాగు లోలెవల్‌ వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహించింది. 

వేములవాడ వైపు నుంచి గుండన్నపల్లె వైపు వెళ్తున్న కారు వంతెనపై నీటి ప్రవాహానికి నిలిచిపోయింది. కారులో ఉన్న ఇద్దరు కేకలు వేయడంతో స్తంభంపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు అక్కనపల్లి కరుణాకర్‌ ఆధ్వర్యంలో కారులో ఉన్న స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Updated Date - 2022-08-05T05:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising