చొప్పదండిలో భారీ వర్షం
ABN, First Publish Date - 2022-06-17T06:06:03+05:30
చొప్పదండి పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
- రాయపట్నం రహదారిపై నేలకూలిన భారీ వృక్షం
చొప్పదండి, జూన్ 16: చొప్పదండి పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి భారీ వర్షం పడగా మళ్లీ గురువారం సాయంత్రం అరగంటపాటు భారీ వర్షం కురిసింది. వర్షంధాటికి రాయపట్నం రహదారిపై ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ఉన్న భారీ వేపచెట్టు నేల కూలింది. రహదారికి అడ్డంగా చెట్టు పడిపోయింది. ఆ సమయంలో ప్రజలు రోడ్డుపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెండువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోగా మున్సిపల్ సిబ్బంది, స్థానికులు చెట్టును తొలగించారు.
వర్షంతో ట్రాన్స్‌కోకు రూ. మూడు లక్షల మేర నష్టం
గణేశ్‌నగర్, జూన్ 16: జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షంతో విద్యుత్‌శాఖకు మూడు లక్షల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్‌స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి సరఫరా నిలిచిపోయినట్లు ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన విరిగిన స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ బిగించినట్లు వెల్లడించారు. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గంగాధర్ తెలిపారు.
Updated Date - 2022-06-17T06:06:03+05:30 IST