ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభోత్సవానికి ఆహ్వానించక అవమానపరిచారు

ABN, First Publish Date - 2022-08-31T05:40:01+05:30

కలెక్టర్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాల నేతలకు ఆహ్వానం పంపించక అవమానపర్చారని మాజీ ఎ మ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జిల్లా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జుల రామకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 30: కలెక్టర్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాల నేతలకు ఆహ్వానం పంపించక అవమానపర్చారని మాజీ ఎ మ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జిల్లా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లా ప్రజలకు సంబంధించిన కార్యాలయాల భవన సముదాయమని, దీనికి ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ నా యకులే హాజరుకావాలని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే టీఆర్‌ఎస్‌ ప్రజాప్ర తినిధులు లేరన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితుడు ఆత్మహత్య చేకుకుంటే దానికి కారకులైన టీఆర్‌ఎస్‌నేతను పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఖండిం చారు. ప్రధాని మీటర్ల గురించి మాట్లాడిన అంశాన్ని వక్రీకరించి ముఖ్య మంత్రి కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇక్కడి సమస్య లు వదిలి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతాడట అని ఎద్దేవా చే శారు.కేంద్రం గ్రామాలు అబివృద్ధి చెందాలని రైతు వేదికలు, శ్మశానవాటి కలు, సీసీరోడ్లు నిర్మాణాలు చేపట్టిందన్నారు. ప్రజల్లో కేసీఆర్‌పై విశ్వాసం పోయిందని, రానున్న రోజుల్లో గద్దెదించుతారన్న సంగతి మర్చిపోకని సూచించారు. ఈ కార్యక్రమంలో కాసర్ల జనార్ధన్‌రెడ్డి, పిన్నింటి రాజు, పర్శ సమ్మయ్య, వెల్లం పల్లి శ్రీనివాసరావు, రవీందర్‌, తదితరులున్నారు. 

Updated Date - 2022-08-31T05:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising