ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

ABN, First Publish Date - 2022-10-17T05:59:31+05:30

జిల్లాలో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలి మినరి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

పరీక్ష నిర్వహణ తీరును పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

80.64శాతం అభ్యర్థుల హాజరు 

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌  

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 16: జిల్లాలో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలి మినరి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణ తీరును  క లెక్టర్‌ రవి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షల నిర్వహణకు గాను జిల్లాలో మొత్తం 6885 మంది అభ్యర్థులకు అవసర మైన 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆదివా రం నిర్వహించిన పరీక్షకు 5552 మంది అభ్యర్థులుహాజరుకాగా, 1333 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు.

నిమిషం నిబంధనతో ముగ్గురికి నిరాశ...

 ఒక్క నిమిషం నిబంధన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శాపంగా మారింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ డి గ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్‌-1 పరీక్ష కేంద్రానికి ముగ్గురు అభ్య ర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా రావంతో అధికారులు అనుమతించ లే దు. సుమారు ఎనిమిదేళ్లుగా నిరీక్షించి తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని ని మిషం నిబంధనతో  కోల్పోయామని అభ్యర్థులు కన్నీటి పర్యంతం అయి, నిరాశతో వెనుదిరిగారు.


నాచుపెల్లి జేఎన్‌టీయూలో..

కొడిమ్యాల: మండలంలోని నాచుపెల్లి జేఎన్‌టీయూలో ఆదివారం నిర్వ హించిన గ్రూప్‌-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 744 మంది అభ్యర్థు లకు గాను 574 మంది అభ్యర్థులు హాజరు కాగా, 170 మంది గైర్హాజరు అయినట్లు చీఫ్‌ సూపరిండెంట్‌, ప్రిన్సిపాల్‌ రమేష్‌ తెలిపారు. పరీక్షా కేం ద్రాన్ని కలెక్టర్‌ జి. రవి పరిశీలించారు. కొడిమ్యాల, మల్యాల ఎస్సైలు కె. వెంకట్‌రావు, చిరంజీవి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 


Updated Date - 2022-10-17T05:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising