ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పెద్దమ్మ బోనాలు

ABN, First Publish Date - 2022-01-17T05:07:26+05:30

మండల కేంద్రంలో ముదిరాజ్‌ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు శనివారం ఘనంగా నిర్వహించారు

బోనాలతో తరలివస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాల్వ శ్రీరాంపూర్‌, జనవరి 16: మండల కేంద్రంలో ముదిరాజ్‌ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంక్రాతి రోజు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ  సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్‌ రెడ్డి, ఎంపీపీ నూనెటి సంపత్‌, జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యక్రమానికి హజరైన అతిథులను ముదిరాజ్‌ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి, పాడిపంటలతో, కరోనా మహమ్మారి పోయి ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ గ్రామ అధ్యక్షులు రణవేన శ్రీనివాస్‌ ఉపాధ్యక్షులు, చొప్పరి సదానందం, సింగిల్‌విండో ఛైర్మన్‌ చదువు రామచంద్రరెడ్డి, సర్పంచ్‌ అడెపు శ్రీదేవిరాజు, వైస్‌ ఎంపీపీ జూకంటి శిరీష, ఉప సర్పంచ్‌ కర్ణాకర్‌, ఓదెల జెడ్‌పీటీసీ గంట రాములు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్‌ వివిధ పార్టీ నాయకులు, ముదిరాజ్‌ కులస్థులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising