ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-26T06:32:18+05:30

కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీలత సిబ్బంది, నిర్వహకులకు ఆదేశించారు.

జగ్గాసాగర్‌లోని కొనుగోలు కేంద్రంను పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీలత

మెట్‌పల్లి రూరల్‌, మే 25 : కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీలత సిబ్బంది, నిర్వహకులకు ఆదేశించారు. బుధవారం మండలంలోని జగ్గాసాగర్‌, ఆత్మకూర్‌ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆర్డివో వినోద్‌ కుమార్‌తో కలిసి ఆకస్మికంగా పరిశీలించి తూకం వేస్తున్న విధానం, ధాన్యంను వివరాలను రైతులతో మాట్లాడి వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులతో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల మేరకు ధాన్యం బరువు 40 కిలోలతో తూకం వేసి రికార్డులో నమోదు చేయాలని, కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి మిల్లర్లకు తరలించాలని సిబ్బందికి, నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వీరి వెంట రూరల్‌ ఆర్‌ఐ సంధ్యరాణి, ఏపీఎమ్‌ విమోచన, ఏఈవోలు భూమేశ్వర్‌, సాగర్‌, వివోఏలు పుష్పలత, లహరి, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.  

మల్లాపూర్‌ : వరి కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు  కలెక్టర్‌ శ్రీలత అధికారులకు అదేశించారు. బుధవారం మండలంలో కుస్తాపూర్‌ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా ఆమె వరి ధాన్యం కుప్పలను, రికార్డులను పరిశీలించారు. ధాన్నాని నాణ్యత ప్రమాణలతో పాటిస్తూ తొందరగా తూకం వేసి మిల్లర్లకు తరలించాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ రవీందర్‌, సర్పంచ్‌ లక్ష్మి-మైపాల్‌, అధికారరులు, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2022-05-26T06:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising