ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ABN, First Publish Date - 2022-07-07T06:49:18+05:30

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల లను తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత పేర్కొన్నారు.

కథలాపూర్‌లో ‘మన ఊరు మన బడి’ పనులు ప్రారంభిస్తున్న జడ్‌పీ చైర్‌పర్సన్‌ వసంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథలాపూర్‌, జూలై 6: కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల లను తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కథలాపూర్‌, భూషణరావుపేట, ఇప్పపల్లి, పోతారం, గంభీర్‌పూర్‌, బొమ్మెన గ్రామాల్లోని పాఠ శాలల్లో మన ఊరు మన బడి కింద మంజూరైన పనులను ప్రారంభించిన అనం తరం మాట్లాడారు. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నమోదు, హాజరు శాతాన్ని పెంచడానికిగాను అన్ని రకాల వసతులు కల్పించనున్నట్టు చెప్పారు.  ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రారంభించి అన్ని రకాల మౌలిక  వసతులు కల్పించాలని సర్కారు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పపల్లిలో మహిళా సంఘం భవనంకు ప్రొసీడింగ్‌ కాపీని అందించడంతో పాటు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. గంభీర్‌పూర్‌లో రైతులు రైతుబంధు తమ ఖాతాల్లో జమ కావడంతో సీఎం చిత్రపటంకు క్షీరాభిషేకం చేశారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, జడ్‌పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి, వైస్‌ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గడీల గంగప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ వర్ధినేని నాగేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ నాంపల్లి లింబాద్రి, సింగిల్‌ విండో చైర్మన్లు దాసరి గంగాధర్‌, చుక్క దేవరాజం, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ నవీన్‌, ఎంపీవో ప్రవీణ్‌, ఎంఈఓ ఆనందరావు, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

కథలాపూర్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంతకు కార్మికులు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ  నాయకుడు సుతారి రాములు మాట్లాడుతూ నామమాత్రపు వేతనాలతో భోజన కార్మికులు వంటలు చేస్తుంటే న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభు త్వం విఫమైంందన్నారు. సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చెన్నవేని దశరథం ఉన్నారు.

Updated Date - 2022-07-07T06:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising