ఉపాధి కూలీలకు ప్రభుత్వం మరింత భరోసా
ABN, First Publish Date - 2022-12-16T01:16:47+05:30
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత భరోసా కల్పించేలా ప్రమాద బీమా పరిహారం పెంచుతూ నిర్ణయం తీసు కుంది. కూలీలు పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతిచెందితే అందించే పరిహారం పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ఫ ప్రమాద బీమా రూ.50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంపు
పెద్దపల్లి రూరల్, డిసెంబరు 15 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత భరోసా కల్పించేలా ప్రమాద బీమా పరిహారం పెంచుతూ నిర్ణయం తీసు కుంది. కూలీలు పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతిచెందితే అందించే పరిహారం పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధి హమీ పనులు చేస్తున్న కూలీలతో పాటు వారి కుటుంబ సభ్యు లకు ప్రయోజనం కలుగనుంది. పనిచేస్తున్న సమయంలో కూలీలకు అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. సాదారణంగా మట్టిపెల్లలు విరిగిపడటం, ట్రాక్టర్‌లు, గడ్డపారలు తగలడం వంటి ఘటనలతో కూలీలు గాయాల పాలు అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతుంటారు. ఇవే కాకుండా వడ్డదెబ్బ, పాముకాటు, గుండెపోటుతో మృతిచెందినా ఈ పరిహారం అందుతుంది.
పెద్దపల్లి మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మొత్తం 15,942 జాబ్‌కార్డులు, 36885 మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది మండలంలో 4,97,692 పనిదినాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 65 శాతం పనిదినాలు పూర్తయ్యాయి. ఉపాధి హామీలో కూలీలు ప్రధానంగా నీటి నిల్వల పెంపునకు కందకాలు తవ్వకం, చెరువు ల్లో పూడికతీత, కాలువ మరమ్మతులు, మొక్కల పెంపకం వంటి పనులు చేస్తుంటారు. పనులు చేస్తున్న సమయంలో కూలీలు గాయపడితే గతంలో భాధితులకు రూ.25 వేలు ఇచ్చేవారు. ఇప్పడు దానాని 50 వేలకు పెంచారు. ఇక చికిత్సకు అయ్యేఖర్చును బట్టి లక్ష వరకు చెల్లిస్తారు. ఒకవేళ అంగవైకల్యం చెందితే గతంలో రూ.50 వేలు చెల్లించేవారు, ప్రస్తుతం దానిని లక్షకు పెంచారు. ప్రమాదంలో ఛాతీనొప్పి, వడదెబ్బ, గుండెపోటుతో మృతిచెందితే ఇంతకుముందు రూ.50 వేలు చెల్లిస్తుండగా దానిని రూ. 2 లక్షలకు పెంచారు. రోజువారి ఉపాధి పనులకు వచ్చే కూలీల విషయంలో అధికారులు ముందస్తుగానే జాగ్రత్తలు పడు తుంటారు. వేసవికాలంలో కూలీలు అక్కడక్కడ వడదెబ్బ బారినపడి చనిపోతుంటారు. పెంచిన ప్రమాదబీమా పరిహారం ఉపాధి కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
బీమా రెట్టింపు చేయడం హర్షణీయం
రాజేశ్వరి, ఉపాధి కూలీ, కనగర్తి
ఉపాధిహామీ పనులకు ఎక్కువగా నిరుపేదలే ఉంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పని ప్రదేశాల్లో అనుకోకుండా ఏవైనా ప్రమాదాలు జరి గితే కొంత మేర పరిహారం ఇచ్చేది. ఇప్పుడు దానిని రెట్టింపు చేయడం సంతోషం.
కూలీలకు మరింత ప్రయోజనం
- రాజు, ఎంపీడీవో, పెద్దపల్లి
సాధారణంగా ఉపాధి పనులకు వచ్చే కూలీలకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. వేసవికాలంలో ఎక్కువ మంది పనులకు వస్తుంటారు. ప్రమాద బీమా రెట్టింపు చేయడం మంచిదే. ప్రభుత్వ నిర్ణయం కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Updated Date - 2022-12-16T01:16:59+05:30 IST