ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2022-01-26T06:30:42+05:30

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు.

దివ్యాంగులకు వాహనాలను అందజేస్తున్న వాసుదేవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దివ్యాంగుల కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ వాసుదేవరెడ్డి

సిరిసిల్ల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సినారె కళామందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏఎల్‌ఐఎంసీవో సంస్థ, ఏడీఐపీ పథకం ద్వారా జిల్లాలోని దివ్యాంగులకు, ఆర్‌వీవై పథకం ద్వారా వయోవృద్ధులకు ఉచితంగా సహాయ ఉపకరణాలను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు, వయో వృద్ధులకు అవసరమయ్యే ఉపకరణాలు అందించడానికి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన ఉపకరణాలు అందిస్తామన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు అసరాగా రూ.3016, వృద్ధులకు రూ.2016 చొప్పున పింఛన్‌ అందిస్తోందన్నారు. మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగులకు గిప్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం ద్వారా ఉచితంగా త్రి చక్ర మోటారు వాహనాలను అందిస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులు అత్మ స్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఇదే సందర్భంలో బాలిక దినోత్సవానికి సంబంధించి సఖి కేంద్రం అధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, ఎంపీపీ వేణుగోపాల్‌, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు  చందర్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అద్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, కౌన్సిలర్లు దిడ్డి మాధవి, గడ్డం లత, సఖి సెంటర్‌ ప్రతినిధులు రోజా, సుచరిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T06:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising