ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్మపురిలో వైభవంగా గోదావరి మహా హారతి

ABN, First Publish Date - 2022-11-22T00:35:14+05:30

ధర్మపురి క్షేత్రంలో గోదావరి మహా హారతి కార్య క్రమాన్ని సోమవారం రాత్రి వైభవంగా నిర్వ హించారు. ధర్మపురి క్షేత్రంలో పదకొండవ సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మపురి, నవంబరు 21: ధర్మపురి క్షేత్రంలో గోదావరి మహా హారతి కార్య క్రమాన్ని సోమవారం రాత్రి వైభవంగా నిర్వ హించారు. ధర్మపురి క్షేత్రంలో పదకొండవ సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళలో అనేక మంది భక్తులు, మహిళలు, ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ కార్యకర్తలు వెంట రాగా పరంధామ ఆశ్రమానికి చెం దిన పూజ్యశ్రీ పరబ్రహ్మ నందగిరి స్వామీజీ, గోదా వరి మహాహారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్‌ పొల్సానీ మురళీధర్‌రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు వీరన్నగారి సురేందర్‌రెడ్డి తదితర వేద పండితులు గోదావరి నది మంగళిగడ్డ స్నానఘట్టం, నది వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హారతి వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం వారందరి సమక్షంలో ప్రముఖ వేదపండితులు పాలెపు భరత్‌శర్మ నేతృత్వంలో గుడ్ల సురేష్‌, గుడ్ల ఆదిత్య, ద్యావళ్ల సాయిశర్మ శాస్త్రోక్తంగా విధి విధానంగా పలు పూజ లు నిర్వహించారు. సుమారు గంట సేపు ప్రజలకు జీవనాధారం అయిన గోదావరి నదికి పూజలు నిర్వహించారు. అంతకు ముందు పరంధామ ఆశ్రమానికి చెందిన పూజ్యశ్రీ పరబ్రహ్మ నందగిరి స్వామీజీ, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్‌ పొల్సాని మురళీధర్‌రావు నదుల ఆరాధన ద్వారా లభించే సత్ఫలితాలు, హిందుత్వం, ధర్మ పరిరక్షణ, ప్రాచీన సంస్కృతి గురించి ధార్మిక ప్రసంగం చేశారు. శ్రీ రామంజనేయ నృత్యాలయం నిర్వాహకురాలు గడిపెల్లి యుగరాణి, శివాని నృత్యా లయంలో ఆధ్వర్యంలో చిన్నారులచే నిర్వహించబడిన భరత నాట్యం, కూచిపూడి నాట్యం ఎంతో ఆకట్టు కుంది. ఈ కార్యక్రమంలో గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్‌ పొల్సానీ మురళీధర్‌రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు వీరన్నగారి సురేందర్‌రెడ్డి, గోదావరి హారతి రాష్ట్ర కన్వీనర్‌ లింగంపెల్లి వీరగోపాల్‌, కో కన్వీనర్లు దామెర రాంసుధాకర్‌రావు, బలు మూరి సంతోష్‌రావు, జగిత్యాల జిల్లా కన్వీనర్‌ పిల్లి శ్రీనివాస్‌, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ కన్నం అంజ య్య, కిసాన్‌మోర్చా నాయకులు సుగుణాకర్‌రావు, క్యాతం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఫ ధర్మపురి క్షేత్రంలో సోమవారం కార్తీక సందడి నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని పరంధామ ఆశ్రమానికి చెందిన పూ జ్యశ్రీ పరబ్రహ్మ నందగిరి స్వామీజీ, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్‌ పోల్సానీ మురళీధర్‌రావు దంపతులు, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు వీరన్నగారి సురేందర్‌రెడ్డి సందర్శించారు.

కోటిలింగాలలో భక్తుల రద్దీ

వెల్గటూర్‌ : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కోటిలింగాలలో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఇసుక లింగాలు చేసి పూజలు చేశారు. అర్చకులచే సంకల్పం చెప్పించు కొని మహిళలు భక్తితో కార్తీక దీపాలు వెలిగించి వాటిని గోదావరి నదిలో వదిలారు. శ్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకొన్న భక్తులు స్వామి వారికి భక్తి తో అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగ ణంలోని కాశీ శివ లింగాలనికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేశారు.

Updated Date - 2022-11-22T00:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising