ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థల్లో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-12T06:04:42+05:30

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త యిన సందర్భంగా ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగం గా అల్ఫోర్స్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహించారు.

విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న అల్ఫోర్స్‌ విధ్యాసంస్థల అధినేత నరేందర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 11: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త యిన సందర్భంగా ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగం గా అల్ఫోర్స్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహించారు. స్థానిక పురాణీపేట నుంచిపట్టణంలోని పురవీధు ల గుండా నిర్వహించిన తిరంగా ర్యాలీని అల్ఫోర్స్‌ విధ్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశం చాలా గొప్పదని, మన దేశం సాధించిరన స్వాతంత్య్రం ఇతర దేశాలకు ఎంతో ఆదర్శనీయ మని నరేందర్‌రెడ్డి మాట్లాడారు. అల్ఫోర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కళాశాలల ప్రిన్సి పాళ్లు, భోదనా సిబ్బంది ఉన్నారు. అలాగే తపోవన్‌ హైస్కూల్‌ ఆధ్వర్యం లో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి ఎమ్మె ల్యే సంజయ్‌ కుమార్‌ ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో కౌన్సిలర్‌ గంగాసాగర్‌, కరస్పాడెంట్‌ అను మల్లశ్యాం, ప్రిన్సి పల్‌ శ్వేత ఉన్నారు. జ్యోతి హైస్కూల్‌లో విద్యార్థులు స్వాతంత్య్ర సమర యోధులు ఉపయోగించిన వస్తువులను ప్రదర్శించారు. చిన్నారులు దేశ నాయకుల వేశధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. పాఠశాల డైరెక్ట ర్లు బియ్యాల హరిచరణ్‌రావు, శ్రీధర్‌ రావు, మౌనిక రావు, అజిత్‌రావు, ర జితారావు ఉన్నారు. అలాగే భారత్‌ సురక్షా సమితి, బీజేపీ జగిత్యాల ప ట్టణ శాఖ, పట్టణంలోని 48 వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటా జా తీయ జెండాలు పంపిణీ చేశారు. ఆపీ, రోటరీ క్లబ్‌, రెడ్‌ క్రాస్‌ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని ధరూర్‌ హైస్కూ ల్‌లోని విద్యార్థులకు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేతుల మీదుగా సైకిళ్ల ను అందజేశారు. డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్‌ ఉన్నారు.


Updated Date - 2022-08-12T06:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising