రైతులు కెపాసిటర్‌లు బిగించుకోవాలి
ABN, First Publish Date - 2022-12-16T23:44:06+05:30
రైతులు కెపాసిటర్‌లు బిగించుకొని సహకరించాలని ట్రాన్స్‌కో డీఈ తిరుపతి అన్నారు. శుక్రవారం మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో రైతులకు విద్యుత్ ఆదా గురించి అవగాహన సదస్సును నిర్వహించారు.
మెట్‌పల్లి రూరల్, డిసెంబరు 16 : రైతులు కెపాసిటర్‌లు బిగించుకొని సహకరించాలని ట్రాన్స్‌కో డీఈ తిరుపతి అన్నారు. శుక్రవారం మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో రైతులకు విద్యుత్ ఆదా గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్‌పల్లి డివిజన్ పరిధిలో 57వేల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ కింద ప్రతీ రైతుకు రూ. 25వేలు చెల్లిస్తోందన్నారు. రైతులుకెపాసిటర్లను ఏర్పాటు చేసుకుంటే 20శాతం విద్యుత్ ఆదా అవుతుందని, లో వోల్టేజ్ సమస్యలు తొలిగి మోటరు జీవిత కాలం పెరుగుతుందన్నారు. గ్రామంలో సుమారు 324మంది రైతులు తమ బకాయిలు రూ. 1,40లక్షలు చెల్లించారన్నారు. రెండు నెలల్లోగా కెపాసిటర్లు అమర్చుకుంటామని ట్రాన్స్‌ఫార్మర్ కమిటీ చైర్మన్లు విద్యుత్ అధికారులకు హామీ ఇవ్వడంతో జిల్లా ఎస్‌ఈ సత్యనారాయణ ఫోన్లో స్థానిక రైతులను అభినందించారు.
ఈ సందర్భంగా ఏడీఈ బండలింగాపూర్‌ను దత్తతకు తీసుకొని ఇనుప స్తంభాల తొలగింపు, లూజ్ లైన్లలో స్తంభాలు, ఎత్తు తక్కువగా ఉన్న రోడ్ క్రాసింగ్ లైన్‌లలో స్తంభాలు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగిటి అంజయ్య, ఎంపీటీసీ అంకం స్వప్న-శంకర్, మాజీ సర్పంచు జంగ స్వామి, నాయకులు గంగారెడ్డి, ఎల్లారెడ్డి, నేరెళ్ల శంకర్‌రెడ్డి, పిట్ట నాగార్జున, భూమరెడ్డి, ఏఈ ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:44:08+05:30 IST