ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఇబ్బందులు

ABN, First Publish Date - 2022-05-28T04:51:56+05:30

పదో తేదీన మ్యాచర్‌ వచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అది శ్రీనివాస్‌ అన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌

వేములవాడ టౌన్‌, మే 27: పదో తేదీన మ్యాచర్‌ వచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని బాల్‌నగర్‌   ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు.  మ్యాచర్‌ వచ్చి 17రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వస్తోందన్నారు. రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో రానున్నాయని,  ధాన్యం తడిచే ప్రమాదముందని అన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. రైతుల పక్షాన  కాంగ్రెస్‌ కోట్లాడుతుందని, కాంగ్రెస్‌ పార్టీ రైతులు పేదల పక్షాన ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌  అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో  రాహుల్‌గాంధీ రైతులకు మేలు జరిగే విషయాలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక అమలు జరుగుతాయని తెలిపారు.  ఇసుక, లిక్కరు తరలిస్తున్న లారీలను  ధాన్యం కొనుగోళ్లకు మళ్లించాలని సూచించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్‌, కూరగాయల కొమురయ్య, కనికరపు రాజేష్‌, నాగుల రాములుగౌడ్‌, లింగంపల్లి కిరణ్‌, సాయిని అంజయ్య, నాగుల విష్ణు, అక్కన్నపల్లి నరేష్‌, హారీష్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T04:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising