ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ పాలనకు అంతం తప్పదు

ABN, First Publish Date - 2022-08-17T05:34:02+05:30

రాష్టంలో కుటుంబ పాలన త్వరలో అంతం కానుందని టీఆర్‌ఎస్‌కు రాజకీయ మనుగడ ఉండదని హిందూ సామ్రాజ్య స్థాపన జరుగుతుందని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు.

పార్టీ కండువ కప్పుతున్న ఎంపీ అరవింద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌

మల్లాపూర్‌, ఆగస్టు 16 : రాష్టంలో కుటుంబ పాలన త్వరలో అంతం కానుందని టీఆర్‌ఎస్‌కు రాజకీయ మనుగడ ఉండదని హిందూ సామ్రాజ్య స్థాపన జరుగుతుందని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. మంగళవారం మల్లాపూర్‌లో జరిగిన బీజేపీలో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికల వరకు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోదీ మీద ప్రేమతో భారత మాతకు సేవ చేద్దామని అయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పంటలకు కేంద్రం ఇస్తున్న మద్ధతు ధరలను ఎంపీ ఈ సందర్భంగా వివరించారు. ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారం తెరిస్తే రైతులు లాభపడుతారని అనుబంధ కర్మాగారాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. మల్లాపూర్‌కు చెందిన ప్రధాన నాయకలు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, బద్దం సోమిరెడ్డి ఎంపీ అర్వింద్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సురబి బీమ్‌రావు, జెఎన్‌ వెంకట్‌, గంగాధర్‌, జిల్లా మహిళ మోర్చా నాయకురాలు భాగ్యలక్ష్మి, శాంత పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising