ప్రజలందరికీ కంటి పరీక్షలు.. అద్దాల పంపిణీ
ABN, First Publish Date - 2022-12-07T00:26:49+05:30
రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18వ తేది నుంచి ప్రారంభిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలందరూ కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచితం గా అద్దాలను అందిస్తామని ఆర్థిక, వైద్యారో గ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
సిరిసిల్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18వ తేది నుంచి ప్రారంభిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలందరూ కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచితం గా అద్దాలను అందిస్తామని ఆర్థిక, వైద్యారో గ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మం గళవారం జగిత్యాల నుంచి కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సంద ర్భంగా మంత్రి హారీష్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతిని ధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతిని దులందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్ర మంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. కంటి వెలుగు కోసం 200 కోట్ల రూపాయ లు మంజూరు చేశామని, రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ ర్పాట్లు చేయాలన్నారు. 960 వైద్యులను వారం రోజుల్లోగా నియమించనున్నట్లు తెలి పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అను రాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్ర సాద్, డీఎంహెచ్‌వో డాక్టర్ సుమన్ మోహన్‌రావు, డీపీవో రవీందర్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్‌లు సమ్మయ్య, అన్వేష్, పాల్గొన్నార
Updated Date - 2022-12-07T00:26:53+05:30 IST