ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా సంస్థల సెలవుల పొడిగింపు అమానుషం

ABN, First Publish Date - 2022-01-18T05:55:11+05:30

ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థల సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకోవడం అమానుషమని తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్ధల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్వీ రమణారావు పేర్కొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ట్రస్మా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌వీ రమణారావు

పెద్దపల్లిటౌన్‌, జనవరి 17: ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థల సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకోవడం అమానుషమని తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్ధల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్వీ రమణారావు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ట్రస్మా మండల అధ్యక్షుడు వెలిషోజు శ్రీధర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమణారావు మాట్లాడారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఎంతో పకడ్బందీగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామన్నారు. గతంలో కూడా ఏ ప్రైవేట్‌ విద్యాసంస్థలో కరోనా ఎఫెక్ట్‌ కనబడలేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగించామని ఆయన వివరించారు. సభలు సమావే శాలు, రైతుబంధు సంబురాలు, సినిమా హాళ్ళు, పబ్బులు, క్లబ్‌లపై ఉన్న ప్రేమ విద్యార్థుల భవిష్యత్తుపై లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోం దన్నారు. ఇప్పటికే కరోనాతో ఎందరో విద్యార్థులు వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ విద్యా సంస్థలపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయ న్నారు. ఎంత నష్టాన్నైనా భరించి విద్యార్థుల పురోగతి కోసం ఆరాటపడుతున్నామని, దీనికి ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్నే అంచనావేస్తూ నిర్ణయాలు తీసుకొని వాటికి సడలింపులిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులు వెనక్కితీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లెంకి శ్రీని వాస్‌, ఫజల్‌ అహ్మద్‌, అయాజ్‌, సయీద్‌, మోహన్‌, అమీనోద్దీన్‌, జార్టిరెడ్డి, లక్ష్మన్‌, రమేష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-01-18T05:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising