ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మితిమీరిన రాజకీయ జోక్యం

ABN, First Publish Date - 2022-12-06T23:18:43+05:30

సింగరేణిలో పెరిగిన విపరీత రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల్లోకి వెళ్తోందని ఏఐటీయూసీ జనరల్‌ సెక్రెటరీ సీతారామయ్య ఆరో పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి, డిసెంబరు 6: సింగరేణిలో పెరిగిన విపరీత రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల్లోకి వెళ్తోందని ఏఐటీయూసీ జనరల్‌ సెక్రెటరీ సీతారామయ్య ఆరో పించారు. మంగళవారం ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-2లో ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గును ప్రభుత్వరంగ సంస్థ అయిన విద్యుత్‌ థర్మల్‌ కేంద్రాలకు తరలి స్తున్నారని, సరఫరా చేస్తున్న బొగ్గుకు చెల్లించాల్సిన రూపాయలను మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో ఆర్థికంగా సింగరేణి నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. వేల కోట్లలో సింగరేణికి బకాయిపడిన ప్రభు త్వం వాటి చెల్లింపుల్లో సుముఖంగా లేకపొవడం విడ్డూరమన్నారు. దీనికి తోడు సింగరేణి లాభాల్లోని వందల కోట్ల రూపాయలను మెడికల్‌ కాలేజీలు, ఇంజనీ రింగ్‌ కళాశాలలకు వెచ్చిస్తోందని ఆరోపించారు. సింగరేణి సొత్తును తరలిస్తున్న ప్రభుత్వం.. కార్మికుల వేజ్‌బోర్డుపై నోరువిప్పడం లేదని విమర్శించారు. దీనిపై ఈనెల 9న వేజ్‌బోర్డు జాప్యానికి నిరసనగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపడు తున్నట్లు తెలిపారు. అదే రోజు జీఎం కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 24న రాంచీలో నిర్వహించే సమావేశంలో సమ్మెపై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు వై.విరావు, ఎంఆర్‌సీ రెడ్డి, సురేం దర్‌, సమ్మయ్య, వెంకటేశం, సాంబశివరెడ్డి, సదానందం, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising