ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే రోజుల్లో కొండగట్టులో అద్భుతమైన అభివృద్ధి

ABN, First Publish Date - 2022-05-22T06:01:55+05:30

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం రాబోయే రోజుల్లో అద్భుతమైన అభివృద్ధి చెందనుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

పారాయణం చేస్తున్న మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్సీ కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫమంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ కవిత

మల్యాల, మే 21: సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం రాబోయే రోజుల్లో అద్భుతమైన అభివృద్ధి చెందనుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. కొండగట్టు అంజన్న సన్నిధానంలో కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం 108 శ్రీహనుమాన్‌ చాలీసా పారాయణం మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి మంత్రి ఈశ్వర్‌ పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కొండగట్టు అంజన్న సన్నిధిలో రెండవ సారి 41 రోజుల పాటు నిర్వహిస్తున్న హనుమాన్‌ చాలీసా పారాయణ మహోత్సవం పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. అంతకు ముందు మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భేతాళుడు, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. జన్న సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మందికి అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:01:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising