ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనులను నిత్యం పర్యవేక్షించాలి

ABN, First Publish Date - 2022-01-23T06:18:07+05:30

పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు పారిశుధ్య, ఉపాఽధి హామీ పనులను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ శరత్‌ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న శరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు పారిశుధ్య, ఉపాఽధి హామీ పనులను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ శరత్‌ ఆదేశించారు. శనివారం జిల్లా అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు, పంచాయతీ రాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  జాతీయ గ్రామీణ హామీ పథకం సాప్ట్‌వేర్‌ మారుతున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, ప్రతీ పంచాయతీ పరిధిలో 50 మందికి తగ్గకుండా కూలీలు హాజరయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్లె ప్రగతిలో నిర్మించిన కంపోస్ట్‌ షెడ్‌లు, శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేటట్లు చూడాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా దేశంలో తెలంగాణను ముందజలో ఉంచినందుకు అదనపు కలెక్టర్‌లను అభినందించారు.  సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, అదనపు డీఆర్‌డీవో మదన్‌మోహన్‌, ఎపీడీ నర్సింహులు, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-23T06:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising