ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహనీయుల ఆశయ సాధనకు కృషి

ABN, First Publish Date - 2022-05-23T06:01:04+05:30

మహనీయుల ఆశయసాధన దిశగా అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ 

పెద్దపల్లి కల్చరల్‌, మే 22 : మహనీయుల ఆశయసాధన దిశగా అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీభాగ్యరెడ్డివర్మ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ జ్యోతిప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భాగ్య రెడ్డివర్మ దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకులని అదనపు కలెక్టర్‌ కొనియాడారు. మాదరి భాగయ్య సమాజంలోని కుల వివక్షను, అణచివేతను భరించి, వాటి నుంచి విముక్తి కోసం నిరక్షరాస్యులైన దళిత బాలికల కోసం 26 పాఠ శాలలు స్థాపించారని తెలిపారు. ఆది ఆంధ్ర సభ స్థాపించి ప్రజలను సంఘటితం చేశారన్నారు. దేవదాసి, జోగిని వంటి దురాచారాలను తొలగించేందుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సాహించారని అన్నారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నా మని, ఆయన ఆశయ సాధన దిశగా అందరూ కృషి చేయాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి నాగైలేశ్వర్‌, వివిధ దళిత సంఘాల నాయకులు, కలెక్టరేట్‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising