ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-07-02T06:35:51+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా శాఖ బాధ్యులు డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న యూటీఎఫ్‌ బాధ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల అర్బన్‌, జూలై 1: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెనువెంటనే  పరిష్కరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా శాఖ బాధ్యులు డిమాండ్‌ చేశారు. జగిత్యాల అర్బన్‌ తహసీల్దార్‌ కార్యా లయంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘ పక్షాన వినతిప త్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ భాధ్యులు తిరుక్కోవెల శ్యాం, అంబటి భూమేశ్వర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆ మోదిస్తున్న జాతీయ విద్యావిధానం రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్దం అన్నారు. రాష్ట్రాల హక్కులు కుదించి కేంద్ర పెత్తనం పెరిగే ప్రమాదం ఉందన్నారు. 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు శాపంగా మా రిన జాతీయ పెన్షన్‌ స్కీం ను రద్దు చేయాలని, పాఠశాలల్లో వెక్కిరిస్తున్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఈ యేడాది సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ ఉపా ధ్యాయ సంఘ భాధ్యులు తులసీ ఆగమయ్య, అయిటి సుశీల, మానుపా టి బన్న, జగన్మోహన్‌, శ్రీనివాస్‌ రావు, జయంత్‌, లతీఫ్‌, పీవి ప్రసాద్‌, శ్రీధర్‌,  ఖలి ద్‌పాషా, రాజేంధర్‌, చిన్న అంజయ్య, అరుణ, భారతి, చిరం జీవి, గోవర్ధన్‌, దామోదర్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-07-02T06:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising