ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల నిర్లక్ష్యంతోనే మోతె చెరువుకు గండి

ABN, First Publish Date - 2022-07-02T06:37:20+05:30

ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే జగిత్యా ల అర్బన్‌ మండలంలోని మోతె చెరువుకు గండి పడిందని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాలరూరల్‌, జూలై 1 : ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే జగిత్యా ల అర్బన్‌ మండలంలోని మోతె చెరువుకు గండి పడిందని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జగిత్యాల అర్బన్‌ మండలం లోని మోతె గ్రామంలో గల చెరువుకు గండిపడి తెగిన మత్తడిని పరీశీలిం చా రు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాత్కాలిక నిర్మాణం కాకుండా, శాశ్వతంగా మత్తడి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇరిగేషన్‌ అధి కారి కార్యాలయాన్ని సందర్శించి బఫర్‌జోన్‌, ఎప్‌టీఎల్‌ పరిధిని నిర్దారణ చేయాలని కోరినట్లు తెలిపారు. ఇరిగేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరించి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మరల నష్టం జరిగినట్లు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్‌, కాంగ్రె స్‌ నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకు నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే

ప్రజలకు నష్టం జరుగకుండా అధికారులు త్వరిగతిన చర్యలు చేపట్టా లని ఇరిగేషన్‌ అధికారులను ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జగిత్యాల అర్బన్‌ మండలంలోని మోతె గ్రా మంలో గల పెద్దచెరువుకు గండిపడ్డ మత్తడి ప్రాంతాన్ని ఆయన అధికా రులతో కలిసి పరీశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలోనే చెరువు మత్తడి నిర్మాణం కోసం 3 కోట్ల 90 లక్షల నిధుల ప్రతిపాదనలు తయా రు చేసి పంపినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ మహేష్‌, సర్పంచ్‌లు స్వప్నరాజేశ్వర్‌రెడ్డి, నారాయణగౌడ్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising