ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ ఆంక్షల మధ్య గణతంత్ర వేడుకలు

ABN, First Publish Date - 2022-01-26T05:30:00+05:30

కొవిడ్‌ ఆంక్షల మధ్య జిల్లాలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు.

కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

- పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌

- తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరించిన మంత్రి గంగుల


కరీంనగర్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొవిడ్‌ ఆంక్షల మధ్య జిల్లాలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


 కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో...


కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే కరీంనగర్‌ క్లబ్‌లో జిల్లా కలెక్టర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో అధికారులు, టీఎన్‌జీవో నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


 తెలంగాణ భవన్‌లో పతావిష్కరణ చేసిన మంత్రి


తెలంగాణ భవన్‌, మీసేవ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. కోర్టు చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌, నాయకులు చల్లా హరిశంకర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


  జిల్లా పరిషత్‌లో...


జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో డిప్యూటీ సీఈవో పవన్‌కుమార్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising