ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒగ్గు పూజారులపై వివక్ష విడనాడాలి

ABN, First Publish Date - 2022-01-24T05:53:51+05:30

తరతరాలుగా వస్తున్న సంస్కృతిని కాపాడుకోవాలని, ఆగమశాస్త్రం పేరుతో ఒగ్గు పూజారులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం గోదావరిఖనిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గొళ్ల కుర్మలు భారీ రాలీ చేపట్టారు.

నిరసన తెలుపుతున్న యాదవ సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గోదావరిఖనిలో భారీ ర్యాలీ, నిరసన

కళ్యాణ్‌నగర్‌, జనవరి 23: తరతరాలుగా వస్తున్న సంస్కృతిని కాపాడుకోవాలని, ఆగమశాస్త్రం పేరుతో ఒగ్గు పూజారులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం గోదావరిఖనిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గొళ్ల కుర్మలు భారీ రాలీ చేపట్టారు. అనంతరం మెయిన్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదవ సం ఘం రామగుండం కార్పొరేషన్‌ అధ్యక్షుడు పాతిపెల్లి రవికుమార్‌యాదవ్‌ మాట్లాడు తూ కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో మేలుకొలుపు, ముఖపట్నాలు ఒగ్గు పూజారులే నిర్వహిస్తున్నారని, ఆగమ శాస్త్రం పేరుతో బ్రాహ్మణులచే పూజలు నిర్వహించాలని దేవాదయశాఖ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. ఒగ్గు పూజలు లేకుండా ఆగమశాస్త్రం ప్రకారం పూజలుచేస్తే ఆగమైపోతారని, దేవాదయశాఖ ఇప్ప టికైనా తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చుక్కల శ్రీనివాస్‌, అంబటి నరేష్‌, గుంపు ల ఓదెలు, ఆవుల రాజేష్‌, బోయిని మల్లేష్‌, బాబు ఐలయ్య, మేకల కొమురయ్య, కొ మ్ము కుమార్‌, ఒజ్జ రాజన్న, కొమ్ము చందు తది తరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising