ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోపిడీని అరికట్టేందుకు డిజిటల్‌ కరెన్సీ

ABN, First Publish Date - 2022-10-17T05:46:05+05:30

తెలంగాణ బడ్జెట్‌ను రాజకీయ నాయకులు దోపిడీ చేయకుండా నివారించేందుకు డిజిటల్‌ కరెన్సీ తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించడం హర్షనీయమని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు.

సిరిసిల్లలో డిజిటల్‌ బ్యాంక్‌లో పీఎం సందేశాన్ని వింటున్న ఎంపీ, అఽధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 16 : తెలంగాణ బడ్జెట్‌ను రాజకీయ నాయకులు దోపిడీ చేయకుండా నివారించేందుకు డిజిటల్‌ కరెన్సీ తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించడం హర్షనీయమని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు.  దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 75 ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంక్‌లలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ బ్యాంక్‌ను ఆదివారం ఆన్‌లైన్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు అదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, ఎస్‌బీఐ ఎండీ స్వామినాథన్‌ ప్రారంభించారు. ఆన్‌లైన్‌ లైవ్‌షోలో పాల్గొని ప్రధానమంత్రి సందేశాని డిజిటల్‌ ద్వారా ప్రచారం చేశారు. అనంతరం బ్యాంక్‌లో పూజలు చేసి ఏటీఎంలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బడ్జెట్‌లో ఉన్న ప్రజల సోమ్మును రాజకీయ నాయకులు దోచుకోవడాన్ని నిరోధించేందుకు డిజిటల్‌ కరెన్సీ ఎంతో దోహదపడుతుందన్నారు. గతంలో బ్యాంక్‌లలో ఖాతాలను తీసుకోవాలన్నా, డబ్బులను డ్రా చేయాలన్నా ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారన్నారు.  ప్రజల ఇబ్బందులను తొలగించి బ్యాంక్‌ల సేవలను ప్రజల ముందుకు 24 గంటలు పని చేసేలా తీసుకురావాలనే ధ్యేయంతో ప్రధాన మంత్రి దేశ వ్యాప్తంగా 75 డిజిటల్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించారన్నారు. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు జనగామ జిల్లా కేంద్రాల్లో ఈ డిజిటల్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బ్యాంక్‌లలో  ఇబ్బందులు లేకుండా ఖాతాలను తీసుకోవడం, డబ్బులను జమ చేయడం, డ్రా చేసుకోవడం వంటి వీలు ఉంటుందన్నారు. ప్రజలందరు ఈ డిజిటల్‌ బ్యాంక్‌ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ దిబాషీ మిత్ర, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రవీందర గురవ్‌, రిజినల్‌ మేనేజర్‌ రవిశంకర్‌ ,  ఎస్పీ  రాహుల్‌హెగ్డే, అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, వార్డు కౌన్సిలర్‌ జాగీరు శైలు, ప్రవీణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T05:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising