ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుడి చెరువు రిజర్వాయర్‌గా మారేదెన్నడో..?

ABN, First Publish Date - 2022-05-27T05:24:51+05:30

పట్టణంలోని కుడి చెరువు రిజర్వాయర్‌గా మార్చే ప్రతిపాదన కాగితాలకే పరిమితం అయ్యింది.

చొప్పదండి కుడి చెరువు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 -ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం

చొప్పదండి, మే 26: పట్టణంలోని కుడి చెరువు రిజర్వాయర్‌గా మార్చే ప్రతిపాదన కాగితాలకే పరిమితం అయ్యింది. దశాబ్ధాల కల నెరవేరడం లేదు. పట్టణానికి ఆనుకొని ఉన్న ఈ చెరువును కాదని మండలంలోని రెవెల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాగా, ఈ చెరువు అభివృద్ధికి నోచుకోవడం లేదు. 40 ఏళ్ల కిందటే కుడి చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. చెరువు శిఖం భూమి నుంచి కాకతీయ కాలువ పోతుండగా, తూమును ఏర్పాటు చేసి నీటిని చెరువులోకి మళ్లించాలని ప్రతిపాదించారు. చెరువును రిజర్వాయర్‌గా మార్చితే అదనపు ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు పట్టణంలో భూగర్భ నీటి మట్టం బాగా పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చెరువు నిండినా ఆయకట్టు కింద రెండు పంటల సాగు కు నీరు అందడం లేదు.  అతి తక్కువ ఖర్చుతో ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చే అవకాశం ఉంది. చెరువుకు కింద 700 ఎకరాల ఆయకట్టు ఉండగా రిజర్వాయర్‌గా మార్చితే మరో 500 ఎకరాల ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-27T05:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising