మాతృదేశానికి వస్తాననుకోలేదు....
ABN, First Publish Date - 2022-03-05T06:42:41+05:30
రష్యా, ఉక్రెయిన్‌ల మద్య చోటుచేసుకున్న యు ద్ధంతో తాను మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వస్తానని అనుకోలేదని మెట్‌ప ల్లికి చెందిన తూముల భవానీ పేర్కొంది.
- ఉక్రెయిన్ నుంచి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న తూముల భవానీ
మెట్‌పల్లి, మార్చి 4 : రష్యా, ఉక్రెయిన్‌ల మద్య చోటుచేసుకున్న యు ద్ధంతో తాను మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వస్తానని అనుకోలేదని మెట్‌ప ల్లికి చెందిన తూముల భవానీ పేర్కొంది. కివిలోనీ బోగమలైట్ యూనివ ర్సీటీలో భవానీ ఎంబీబీ ఎస్ మూడవ సంవత్సరం చదువుతోంది. వచ్చే నెల 12వ తేదీన మెట్‌పల్లికి వస్తున్నట్లు భవానీ తన తల్లిదండ్రులైన రాధ-లింగంలకు సమాచారం ఇచ్చింది. ఇంతలోనే రష్యా-ఉక్రెయిన్ సరి హద్దులో పరిస్థితులు మారడం వల్ల భయాందోళనకు గురైంది. పలు మార్లు వీడియో కాల్ ద్వారా భవానీ తన క్షేమ సమాచారం బంధువులకు చేరవేస్తూనే ఉంది. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చొరవ తో స్వగ్రామానికి రాగలిగానని భవానీ ఆనందం వ్యక్తం చేసింది. ఇందుకు కృషి చేసిన ప్రధానీ నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
Updated Date - 2022-03-05T06:42:41+05:30 IST