ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించాలి

ABN, First Publish Date - 2022-05-26T06:31:00+05:30

మన ఊరు మన బడి కార్యక్రమం గ్రౌండింగ్‌లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ జి.రవి

జగిత్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): మన ఊరు మన బడి కార్యక్రమం గ్రౌండింగ్‌లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరు పై కలెక్టర్‌ బుధవారం సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో 274  పా ఠశాలలో మన ఊరు మన బడి కింద ఎంపిక చేయగా ఇప్పటి వరకు 113 పాఠశాలల అనుమతులు పూర్తయ్యాయని, డీఈవోల వద్ద 4 పాఠ శాలలు, ప్రధానోపాధ్యాయులు వద్ద 34 పాఠశాలలు, ఈఈల వద్ద 10 పా ఠశాలలు, ప్రాజెక్ట్‌ తయారు చేయకుండా 59 పాఠశాలలు, ఏఈలో వద్ద 46 పాఠశాలలు అనుమతులు జారీ చేయకుండ పెండింగ్‌లో ఉన్నా యని కలెక్టర్‌ పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. మన ఊరు మన బడి కార్యక్ర మం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమణించామని, జిల్లాలో తక్కువ పను లు చేసిన ఎంఈవోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని, తదుపరి సమావేశానికి సమయానికి పరిస్థితి మెరుగు పడకపోతే సస్పెండ్‌ చేస్తా మని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌. లత, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్‌ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:31:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising