ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-01-26T06:18:47+05:30

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో త్వరిగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 25: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో త్వరిగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ పథకంలో భాగంగా చిర్రకుంట క్లస్టర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బూర్గుడలోని ఎంపీయూపీఎస్‌, జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలల్లో నీటి వసతి, జెండాగూడ, చోర్‌పల్లి, పాడిబండ, బాబాపూర్‌, మోవాడ్‌ గ్రామాల్లో బస్‌ షెల్టర్ల నిర్మాణం, జన్కాపూర్‌, దాంపూర్‌, టెమెరియన్‌మోవాడ అంగన్‌వాడీ కేంద్రాల పనులను వారం రోజుల్లోగా ప్రారంభించి మార్చి వరకు పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనులు పురోగతిలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయం, పశువైద్యశాల, చిర్రకుంట, బూర్గుడలో అదనపు తరగతి గదుల నిర్మాణం, అడదస్నాపూర్‌, మానిక్‌గూడ, చిర్రకుంటలలో బస్సు సెంటర్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయానలి అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణం లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికా రులు చొరవ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, మిషన్‌ భగీరథ, జిల్లా నీటి పారుదల, జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising