ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రుల కళ్ల ముందే కుమారుల మృతి

ABN, First Publish Date - 2022-10-18T05:17:00+05:30

జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇద్దరూ తమ తండ్రులతో కలిసి ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో తండ్రులు గాయాలతో బయటపడగా కుమారులు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - వేర్వేరు రోడ్డు ప్రమాదల్లో ఇద్దరు యువకుల దుర్మరణం

జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇద్దరూ తమ తండ్రులతో కలిసి ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో తండ్రులు గాయాలతో బయటపడగా కుమారులు మృతి చెందారు.

మానకొండూర్‌, అక్టోబరు 17: మండలంలోని ఈదులగట్టెపల్లి గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా ముగ్గురికి గాయాలఅయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన జాలిగం సంపత్‌, జాలిగం శివ తండ్రీ కొడుకులు. వారు ద్విచక్ర వాహనంపై కరీంనగర్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వెనకు నుంచి వచ్చిన ఓ వ్యాను ఓ కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పి కారుకు తగిలి సంపత్‌, శివ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో  శివ (23) అక్కడికక్కడే మృతి చెందగా అతడి తండ్రి సంపత్‌కు గాయాలయ్యాయి. వ్యాన్‌ డ్రైవర్‌ ప్రమాదం జరిగినా ఆగకుండా వేగంగా వెళుతూ మరో కారును ఢీకొట్టి వెళ్లిపోయాడు. వ్యాను మెదటగా ఢీకొన్న కారులో శంకరపట్నం ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తల్లిదండ్రులు నందమ్మ, మల్లయ్య ఉన్నారు. వీరు గన్నేరువరం గ్రామానికి వెళ్లి స్వగ్రామం భూపాలపల్లికి తిరిగి వెళుతున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యానును శంకరపట్నంలో పట్టుకున్నట్లు సీఐ రాజ్‌కుమార్‌ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆసుత్రికి తరలించి, మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు చెప్పారు. తండ్రి కళ్ల ముందే శివ మృతి చెందడం విషాదాన్ని నింపింది.

- హుస్నాబాద్‌ మండలంలో..

హుజూరాబాద్‌ రూరల్‌: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పందిల్ల శివారులోని రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన హుజురాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన ముప్పు అశోక్‌ (33), అతని తండ్రి ముప్పు వీరస్వామి ద్విచక్రవాహనంపై హుస్నాబాద్‌ మండలం రేగొండలోని బంధేవుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. పందిల్ల సమీపంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ వద్ద నాగసముద్రాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వీరు ప్రయాస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డఉప్పుల అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఉప్పుల వీరస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హుస్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీధర్‌ సంఘట స్థలానికి చేరుకుని జరిగిన సంఘట వివరాలను తెలుసుకున్నారు. అశోక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Updated Date - 2022-10-18T05:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising