ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళితబంధు’ను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-27T05:55:52+05:30

దళితబంధు పథకంలో లాభదాయకమైన యూనిట్లను స్థాపించి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన దళితబంధు పథకం లబ్ధిదారులతో కలెక్టర్‌ సమావేశం అయ్యారు

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, మే 26 (ఆంధ్రజ్యోతి): దళితబంధు పథకంలో లాభదాయకమైన యూనిట్లను స్థాపించి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన దళితబంధు పథకం లబ్ధిదారులతో కలెక్టర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కూలీలుగా పనిచేస్తున్న వారు మరో నలుగురికి ఉపాధిని అందించే విధంగా దళితబంధు పథకంలో యూనిట్లను స్థాపించాలన్నారు. వ్యాపార వృద్ధిని సాధించాలన్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించిన రిపోర్టును వెంటనే అందించాలన్నారు. గ్రౌండిగ్‌ పురోగతిని బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేయాలన్నారు. దళిత బంధు నిధులతో కార్లు, ట్రాక్టర్లు, హార్వేస్టర్లు కొంటే నష్టపోతారన్నారు. ఐదేళ్లు దాటితే వాహనాల విలువ  తగ్గిపోతుందన్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింత వృద్ధి సాధిస్తారన్నారు.  సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, డీఆర్డీవో మదన్‌మోహన్‌, జిల్లా పరిశ్రమ కేంద్రం మేనేజర్‌ ఉపేందర్‌, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి కోమురయ్య తదితరులు పాల్గొన్నారు. 

    

Updated Date - 2022-05-27T05:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising